మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 13:32:49

టీవీ చూసి పెన్సిల్‌ను మింగేసిన బాలుడు‌!

టీవీ చూసి పెన్సిల్‌ను మింగేసిన బాలుడు‌!

త‌ల్లిదండ్రులు నేర్పించే మాట‌లు క‌న్నా టీవీ చూసి నేర్చుకునే ప‌నులు, మాట‌లే ఎక్కువ‌గా ఉంటున్నాయి పిల్ల‌ల‌కు. అవి మంచివైనా, చెడ్డ‌వైనా. ఒక్కోసారి సినిమాల్లో వ‌చ్చే ఫైట్ సీన్లు చూసి ఇంట్లోని సభ్యుల‌తో ట్రై చేస్తుంటారు. ఇవి అయితే పర్వాలేదు. సూసైడ్ చేసుకోవ‌డం, చేతులు కాల్చుకోవ‌డం వంటి ప్ర‌మాద‌క‌ర సంఘ‌ట‌న‌లు చూస్తే పిల్ల‌లు కూడా ఒక‌సారి ట్రై చేద్దాంమ‌నుకుంటారు. అలా చేసి చిక్కుల్లో ప‌డిన‌వారు చాలామందే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి తాడుతో ఉరేసుకునే సీన్‌ను చూసింద‌ట‌. ఎలా వేసుకున్నారో చూద్దాం అని ట్రై చేసింది. పిల్ల‌లు ఆ విధంగా త‌యారువుతున్నారు. ఇటీవ‌ల ఇలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకున్న‌ది.

చైనాకు చెందిన ఏడేండ్ల అబ్బాయి టీవీలో వ‌చ్చే కుంగ్ ఫ్లూ షో చూశాడు. అందులో ఒక వ్య‌క్తి క‌త్తిని తీసుకొని గొంతులోకి దింపుకుంటాడు. అది ఆ బాలుడిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ సీన్ అత‌ని మైండ్‌లో అలానే ఉండిపోయింది. అబ్బాయి ఒక‌రోజు హోంవ‌ర్క్ చేసుకుంటూ ఉన్నాడు. బోర్ కొట్టింది. ఆడుకోవ‌డానికి ఎవ‌రూ లేక‌పోడంతో షోలో చూసిన స్టంట్ గుర్తుకువ‌చ్చింది. అయితే ఆ సీన్‌లో క‌త్తి ఉంది. అత‌నికి క‌త్తి దొర‌క్క‌పోయేస‌రికి చేతిలో ఉన్న పెన్సిల్‌తో ట్రై చేశాడు. నోటి నుంచి గొంతులోకి చొప్పించుకున్నాడు. అది బ‌య‌ట‌కు రాక‌పోయేస‌రికి కేక‌లు వేశాడు. దీంతో కుటుంబ స‌భ్యులు హాస్పిట‌ల్‌లో చేర్చారు. పెన్సిల్ తిర‌గ‌తిప్పి మింగాడు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే క‌డుపులో చొచ్చుకొని ముఖ్య‌మైన అవ‌య‌వాల‌కు గాయాల‌య్యేవని వైద్యులు వెల్ల‌డించారు. టీవీ చూసి ఇన్స్పైర్ అయ్యాన‌ని బాలుడు వైద్యుల‌కు చెప్పడంతో అంద‌రూ షాక్ అయ్యారు. చూశారుగా పిల్ల‌లు ఏవేం చూస్తున్నారో ఓ క‌న్నేసి ఉండాలి. 


logo