శనివారం 23 జనవరి 2021
International - Dec 19, 2020 , 17:16:19

మరుగుదొడ్డిలో రేవ్‌పార్టీ..!

మరుగుదొడ్డిలో రేవ్‌పార్టీ..!

న్యూయార్క్‌: ఓ విద్యార్థికి తన స్కూల్‌ మరుగుదొడ్డిలో రేవ్‌పార్టీ పెట్టాడు. డీజే ట్యూన్స్‌ ప్లే చేశాడు. స్నాప్‌చాట్‌లో తన ఈవెంట్‌ను ప్రచారం చేశాడు. అయితే, ఈ తతంగమంతా స్కూల్‌ టీచర్లకు తెలిసిపోయింది. వెంటనే వచ్చి అతడి డీజే సామగ్రిని తీసేసుకుని, ఇంటికి పంపించారు. అతడు ఇంట్లోకి వాలిపోయిన ముఖంతో వస్తున్న ఫొటో, అతడి వీడియోలను తల్లి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్‌ అవుతున్నాయి. 

కేల్ బెల్ అనే విద్యార్థి సెయింట్ ఆంటోనీ కాథలిక్ స్కూల్‌ విద్యార్థి. ట్యూన్ స్పిన్ చేయడమంటే అతడికి చాలా ఇష్టం. డిసెంబర్ 11 న తన స్కూల్‌ టాయిలెట్‌లో రేవ్‌పార్టీ పెట్టి స్నాప్‌చాట్‌లో తన ఈవెంట్‌ను క్లాస్‌మేట్స్ కోసం మాత్రమే ప్రచారం చేశాడు.  30 నిమిషాల పాటు పార్టీ కొనసాగింది. పాఠశాల సిబ్బంది వచ్చి వెంటనే స్పీకర్లు, లైట్లన్నింటినీ జప్తు చేశారు. అతడి ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన తల్లి లూయిస్‌ బెల్‌ ‘రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు’ అంటూ క్యాప్షన్‌పెట్టింది. అయితే, తన కొడుకు చేసిన తప్పుకు అతడిని నిందించడం లేదని, అది అతడి అభిరుచి అని వెనకేసుకొచ్చింది. ఆమె ఎఫ్‌బీ ఫాలోవర్స్‌, నెటిజన్లు కూడా కేల్‌బెల్‌ ప్రతిభను మెచ్చుకున్నారు. అతడి డీజే పరికరాలను త్వరలోనే పొందుతాడని పలువురు కామెంట్‌ కూడా చేశారు. 

 ఇవి కూడా చదవండి..

చైనాపై అమెరికా విదేశాంగ మంత్రి విమర్శలు

చైనాకు అమెరికా భారీ షాక్: చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేసిన అమెరికా

జో బైడెన్ బృందంలో మరొక భారతీయుడు


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo