శనివారం 30 మే 2020
International - Apr 07, 2020 , 18:13:13

బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

హైదరాబాద్‌ : బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విదితమే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ జాన్సన్‌.. లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో జాన్సన్‌ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్‌ రాబ్‌ వెల్లడించారు. మార్చి 27 నుంచి జాన్సన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అదే రోజు ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించారు. బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా స్పందించారు. బోరిస్‌ తనకు మంచి స్నేహితుడు అని ట్రంప్‌ పేర్కొన్నారు. బోరిస్‌కు మంచి వైద్యం అందేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు. బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం కొంత విషమంగా ఉందని వార్తలు రావడంతో బ్రిటన్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది.  


logo