శుక్రవారం 05 జూన్ 2020
International - May 03, 2020 , 09:31:09

లీట‌ర్ల కొద్ది ఆక్సిజ‌న్ ఇచ్చారు: బోరిస్ జాన్స‌న్‌

లీట‌ర్ల కొద్ది ఆక్సిజ‌న్ ఇచ్చారు:  బోరిస్ జాన్స‌న్‌

హైద‌రాబాద్‌: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌.. త‌న‌కు జ‌రిగిన క‌రోనా చికిత్స గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు.  త‌న ప్రాణాల‌ను నిలిపేందుకు డాక్ట‌ర్లు త‌న‌కు లీట‌ర్ల కొద్ది ఆక్సిజ‌న్ ఇచ్చిన‌ట్లు చెప్పారు. మార్చి 26న బోరిస్‌కు వైర‌స్ ఉన్న‌ట్లు తేలింది. ఆ త‌ర్వాత ప‌ది రోజుల‌కు  వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో బోరిస్ .. హాస్పిటిల్‌కు వెళ్లారు. ఆయ‌న్ను కొన్ని రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచిన విష‌యం తెలిసిందే. అయితే తాను హాస్పిట‌ల్‌లో బెడ్ మీద ఉన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వాన్ని న‌డిపేందుకు ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు చెప్పారు.   లండ‌న్‌లోని సెయిట్ థామ‌స్ హాస్పిట‌ల్‌లో బోరిస్ చికిత్స పొందారు.  కొన్ని రోజుల క్రిత‌మే బోరిస్‌, త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ జంట‌కు మ‌గ‌పిల్ల‌వాడు జ‌న్మించాడు. ఆ పిల్లోడికి విల్‌ఫ్రెడ్ లారీ నికోల‌స్ జాన్స‌న్ అని పేరు పెట్టారు. ఆ పేరులో ఇద్ద‌రు తాత‌య్య‌ల పేర్లు, బోరిస్‌కు చికిత్స అందించిన‌ మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల పేర్లు ఉన్నాయి.

     


logo