బుధవారం 03 జూన్ 2020
International - May 12, 2020 , 14:53:35

వ్యాక్సిన్‌పై గ్యారెంటీ ఇవ్వ‌లేను..

వ్యాక్సిన్‌పై గ్యారెంటీ ఇవ్వ‌లేను..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ ప్ర‌జ‌లు కొన్నాళ్ల పాటు జీవ‌నం కొన‌సాగించాల్సి వ‌స్తుంద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ తెలిపారు. కోవిడ్‌19ని అడ్డుకునేందుకు విజ‌య‌వంతంగా వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తామ‌న్న గ్యారెంటీ లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులకు అనుగుణంగా మారాల‌న్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బోరిస్ జాన్స‌న్‌.. దేశంలో లాక్‌డౌన్ స‌డ‌లిస్తున్న‌ట్లు చెప్పారు. కానీ వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో ఆయ‌న పూర్తి క్లారిటీ ఇవ్వ‌లేదు.  వ్యాక్సిన్ గురించి ఓ జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు ఆయ‌న సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆశిద్దాం, ఆక్స్‌ఫ‌ర్డ్ నుంచి ఆశాజ‌న‌క‌మైన విష‌యాలు వింటున్నాం, కానీ దీని ప‌ట్ల గ్యారెంటీ ఇవ్వ‌లేన‌న్నారు.  ఎందుకంటే 18 ఏళ్ల నుంచి సార్స్‌కు వ్యాక్సిన్ లేద‌న్నారు.

వ్యాక్సిన్ త‌యారీ కోసం బ్రిట‌న్ ప్ర‌భుత్వం భారీగా నిధుల‌ను స‌మ‌కూర్చుతున్న‌ద‌ని, ఈ అంశంలో ఇత‌ర దేశాల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రానున్న రోజుల్లో క‌రోనా చికిత్స ఔష‌ధాన్ని డెవ‌ల‌ప్ చేస్తామ‌ని బ్రిట‌న్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ పాట్రిక్ వాలెన్స్ తెలిపారు.  
logo