శనివారం 06 జూన్ 2020
International - Apr 07, 2020 , 18:16:43

ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌తో శ్వాస‌పీలుస్తున్న‌ బ్రిట‌న్ ప్ర‌ధాని..

ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌తో శ్వాస‌పీలుస్తున్న‌ బ్రిట‌న్ ప్ర‌ధాని..

లండన్‌:  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో కరోనా వైరస్  చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో  చేరిన ఆయనకు  ఆక్సిజన్  అందిస్తున్నారని  కేబినెట్  మంత్రి ఒకరు ధృవీకరించారు.  ప్రధాని బోరిస్ ఆక్సిజన్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని,   ఆయన వెంటిలేటర్‌పై లేరని కేబినెట్‌ మంత్రి మైఖేల్ గోవ్   వెల్లడించారు.  థామస్‌ హాస్పిటల్‌లో ఆయనకు మెరుగైన వైద్యం అందుతోందని గోవ్‌ వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. 

కరోనా వైరస్‌ సోకడంతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కొన్ని రోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. తనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిందని   జాన్సన్ మార్చి 27న ప్రకటించారు. ఐతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో  లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేరారు.  


logo