బుధవారం 03 జూన్ 2020
International - Apr 20, 2020 , 01:02:27

మళ్లీ ప్రభుత్వ విధుల్లోకి బ్రిటన్‌ ప్రధాని

మళ్లీ ప్రభుత్వ విధుల్లోకి బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: బ్రిట న్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వ బాధ్యతల్లో నిమ గ్నమయ్యారు. కరోనా బారినపడిన జాన్సన్‌ వా రం రోజుల క్రితం దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. జాన్సన్‌ ప్రస్తు తం ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని చెకర్స్‌ (బ్రిటన్‌ ప్రధాని నివాసం)లో కోలుకొంటున్నారు. అక్కడి నుంచే ఆయన బ్రిటన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌తోపాటు ఇతర మంత్రివర్గ సహచరులకు మార్గనిర్దేశం చేస్తున్నారని, మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయి విధులు నిర్వర్తించేందుకు జాన్సన్‌ సిద్ధమవుతున్నారని ‘సండే టెలిగ్రాఫ్‌' పత్రిక వెల్లడించింది. జాన్సన్‌ గతవారం రాబ్‌తోపాటు ఇత ర సీనియర్‌ సహచరులకు ఫోన్‌కాల్స్‌చేసి కొన్ని ఆదేశాలు జారీచేశారు. జాన్సన్‌ తన మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపారని, ఎక్కువ భేటీలు డౌనింగ్‌ స్ట్రీట్‌లోని ఆయన ప్రైవేటు కార్యాలయంలో జరిగాయని  కమ్యూనిటీస్‌మినిస్టర్‌ జెన్రిక్‌ చెప్పారు. 


logo