గురువారం 13 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 02:35:39

చూస్తూ ఊరుకోబోం!

చూస్తూ ఊరుకోబోం!

వాషింగ్టన్‌, జూలై 1: నియంతృత్వ చర్యలు, చట్టాలతో హాంకాంగ్‌ను మింగెయ్యాలనుకుంటే, చూస్తూ ఊరుకోబోమని అమెరికా చైనాను హెచ్చరించింది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉన్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి చైనా మంగళవారం ఆమోదం తెలిపింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో స్పందించారు. హాంకాంగ్‌ ప్రజలకు ఇదో విచారకరమైన రోజుగా అభివర్ణించారు. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని కాలరాయడమే చైనా గొప్ప విజయంగా భావిస్తున్నదన్నారు. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’గా ఉన్న విధానాన్ని.. ‘ఒక దేశం, ఒక వ్యవస్థగా’ మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.logo