బుధవారం 03 జూన్ 2020
International - Apr 29, 2020 , 15:08:17

బోరిస్ జాన్స‌న్‌కు పుత్రోత్సాహం..

బోరిస్ జాన్స‌న్‌కు పుత్రోత్సాహం..

హైద‌రాబాద్‌: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌కు కొడుకు పుట్టాడు.  గ‌ర్ల్‌ఫ్రెండ్ క్యారీ సైమండ్స్  మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు ప్ర‌ధాని ప్ర‌తినిధి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  త‌ల్లీ, కుమారుడు ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించింది. లండన్‌లోని హాస్పిట‌ల్‌లో పుట్టిన బేబీ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని కార్యాల‌యం పేర్కొన్న‌ది. ఎన్‌హెచ్ఎస్ మెట‌ర్నిటీ బృందానికి ప్ర‌ధాని, ఆయ‌న ఫియాన్సీ సైమండ్స్ కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బోరిస్ జాన్సన్ వ‌య‌సు 55 ఏళ్లు కాగా ఆయ‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్ వ‌య‌సు 32 ఏళ్లు. గ‌త ఏడాది ఈ ఇద్ద‌రూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేస‌వి కాలంలో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న‌ట్లు మార్చిలో ప్ర‌క‌టించారు. జాన్స‌న్‌, సైమండ్స్‌కు పెళ్లి కాలేదు. కానీ వారు ఒక‌టిగా జీవిస్తున్నారు.  అయితే ప్ర‌ధాని కార్యాల‌యం డౌనింగ్ స్ట్రీట్‌లోకి పెళ్లికాకుండా  అడుగుపెట్టిన తొలి జంట వీరిదే కావ‌డం విశేషం. ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ సోకిన జాన్స‌న్‌.. హాస్పిట‌ల్లో చికిత్స పొందారు.  ఇంటెన్సివ్ కేర్‌లో ఆయ‌న కొన్ని రోజులు గ‌డిపారు.  మ‌ళ్లీ సోమ‌వార‌మే ఆయ‌న తిరిగి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టారు.  గ‌ర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్‌కు కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.logo