బుధవారం 27 మే 2020
International - May 17, 2020 , 17:14:57

వైద్య సిబ్బంది ల‌క్ష్యంగా బాంబు పేలుడు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

వైద్య సిబ్బంది ల‌క్ష్యంగా బాంబు పేలుడు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ఖోస్ట్ ప్రాంతంలో వైద్య సిబ్బంది ల‌క్ష్యంగా తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు బాంబు పేలుడుకు పాల్ప‌డ్డారు. ఈ పేలుడులో ఖోస్ట్ ప‌బ్లిక్‌ హెల్త్ క‌మిష‌న‌ర్ స‌హాయ‌కుడు, ముగ్గురు వైద్యులు స‌హా మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆఫ్గ‌నిస్థాన్ నేష‌న‌ల్ ఆర్మీ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గాయ‌ప‌డిన అంద‌రినీ చికిత్స నిమిత్తం ఖోస్ట్‌లోని సివిల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఆదివారం తెల్ల‌వారుజామున ఈ పేలుడు చోటుచేసుకుంద‌ని అధికారులు పేర్కొన్నారు.    



logo