బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 02:26:32

కరోనా.. ఒక చిన్న ఫ్లూ

కరోనా.. ఒక చిన్న ఫ్లూ

-బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో 

బ్రసిలియా:  కరోనా విశ్వమారి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నా.. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను ‘చిన్న ఫ్లూ’గా అభివర్ణించారు. దానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బ్రెజిల్‌ ఆర్థిక రాజధాని సావోపౌలో రాష్ట్రంలో కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడంపై వస్తున్న విమర్శలపైనా వ్యగ్యంగా స్పందించారు. ‘నన్ను క్షమించండి. కొందరు చనిపోతారు. అది జీవితం. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్ల తయారీ ఫ్యాక్టరీని మూయలేం’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో విస్తరిస్తున్న కరోనాను రాజకీయాలకు ఒక సాధనంగా వాడుకోవడంపై బోల్సనారో అసంతృప్తి వ్యక్తం చేశారు. సావోపౌలోలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నా, సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారని ఆ రాష్ట్ర గవర్నర్‌ జోవో డోరియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


logo