మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 17:11:03

మూతిని ప‌చ్చ‌డి చేస్తా.. రిపోర్ట‌ర్‌కు దేశాధ్య‌క్షుడు వార్నింగ్‌

మూతిని ప‌చ్చ‌డి చేస్తా.. రిపోర్ట‌ర్‌కు దేశాధ్య‌క్షుడు వార్నింగ్‌

హైద‌రాబాద్‌: బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో ఓ రిపోర్ట‌ర్‌కు లైవ్‌లోనే వార్నింగ్ ఇచ్చారు.  మూతి ప‌గల‌గొట్టాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు.  బ్రెసిలియాలోని ఓ చ‌ర్చికి వెళ్లిన బొల్స‌నారోను జ‌ర్న‌లిస్టులు చుట్టుముట్టారు.  అయితే ఆ స‌మ‌యంలో ఓ రిపోర్ట‌ర్‌.. బొల్స‌నారో కుమారుడికి చెందిన ఓ అవినీతి కేసు గురించి ప్ర‌శ్న వేశారు.  బొల్స‌నారో పెద్ద కుమారుడు ఫ్లావియో బొల్స‌నార‌తో వ‌ద్ద‌ ప‌నిచేసిన  ఓ వ్య‌క్తి అక్ర‌మంగా ఫ‌స్ట్ లేడీ అకౌంట్‌లో భారీ న‌గ‌దు జ‌మా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తిని హౌజ్ అరెస్టు చేశారు. అయితే ఫ్యామిలీ అవినీతికి సంబంధించి ప్ర‌శ్న వేసిన స‌మ‌యంలో.. నీ మూతిపై ఓ పంచ్ ఇవ్వాల‌ని ఉంది, ఓకేనా అంటూ అధ్య‌క్షుడు స‌మాధానం ఇచ్చారు.   


logo