సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 09:34:24

బోటు మున‌క‌.. 18 మంది మృతి

బోటు మున‌క‌.. 18 మంది మృతి

హైద‌రాబాద్‌:  బ్రెజిల్‌లోని అమెజాన్ న‌దిలో ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో సుమారు 18 మంది మ‌ర‌ణించారు. 70 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఫెర్రీ.. అమెజాన్‌కు చెందిన జారి ఉప‌న‌దిలో బోల్తాప‌డింది. 46 మందిని ర‌క్షించిన‌ట్లు అధికారులు చెప్పారు. అయితే ఎంత మంది ప్ర‌యాణికులు గ‌ల్లంతు అయ్యార‌న్న విష‌యాన్ని చెప్ప‌లేక‌పోయారు.  హెలికాప్ట‌ర్లు, విమానాలు, డైవ‌ర్ల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  ప్ర‌మాద ఘ‌ట‌న ప‌ట్ల బ్రెజిల్ నేవీ విచార‌ణ మొద‌లుపెట్టింది. రెండు బోట్లు ప‌క్క‌ప‌క్క‌న రావ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. క్ష‌ణాల్లోనే బోటు మునిగిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు.  

 


logo