సోమవారం 13 జూలై 2020
International - Jun 20, 2020 , 00:53:02

కొవిడ్‌ చికిత్సలో ప్లాస్మా థెరఫీ సేఫ్‌!

కొవిడ్‌ చికిత్సలో ప్లాస్మా థెరఫీ సేఫ్‌!

వాషింగ్టన్‌, జూన్‌ 19: కొవిడ్‌ చికిత్సలో ప్లాస్మా థెరఫీ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని అమెరికాలోని మయో క్లినిక్‌ వైద్యులు తెలిపారు. కరోనా సోకిన దాదాపు 20వేల మందిపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 2వేల దవాఖానల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ వివరాలను మయో క్లినిక్‌ జర్నల్‌లో ప్రచురించారు. ‘కొవిడ్‌ చికిత్సలో ప్లాస్మా థెరఫీ చాలా భద్రమైనది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. చికిత్స విఫలమై మరణించే రేటు కూడా చాలా తక్కువ’ అని మయో వైద్యుడు మైకేల్‌ జోర్‌ తెలిపారు.  


logo