ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 06:40:26

మృతకణాలను ఉపయోగించి కరోనాకు అడ్డుకట్ట

మృతకణాలను ఉపయోగించి కరోనాకు అడ్డుకట్ట

మాస్కో :   ప్రపంచంలో మొదటిసారి అందుబాటులోకి వస్తున్న రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆ దేశ పరిశోధకులు తోసిపుచ్చారు. గమలేయా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధిచేసిన ఈ వ్యాక్సిన్‌ పనితీరును ఆ సంస్థ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు. శరీరంలోని మృతకణాలను ఉపయోగించి కరోనా వైరస్‌ను అడ్డుకోవటమే ఈ వ్యాక్సిన్‌ రహస్యమని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కణాల పునరుత్పత్తి వేగం పెరుగుతుందని, దాంతో వైరస్‌పై బలహీనపడుతుందని చెప్పారు. వ్యక్తుల శరీరంలో సహజంగా ఉండే జ్వరం వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత బయపడుతుందని, పారసెటమాల్‌ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను రష్యాలో బుధవారం అధికారికంగా రిజిస్టర్‌ చేయనున్నారు. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి వ్యాక్సిన్‌ వేయనున్నామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖైల్‌ మురష్కో తెలిపారు.


logo