మంగళవారం 07 జూలై 2020
International - Jun 30, 2020 , 00:53:33

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలి 23 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలి 23 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని హేల్మండ్‌ రాష్ట్రం నంగిన్‌ జిల్లాలోని రద్దీ మార్కెట్‌లో సోమవారం కారు బాంబు పేలిన ఘటనలో పలువురు పిల్లలతోపాటు 23 మంది పౌరులు మరణించారు. కారుబాంబుతో పాటు మోర్టార్‌ ఫిరంగులు కూడా ఈ ఘటనలో పేలాయని వెల్లడైంది. అయితే, బాధ్యులెవరన్నది తెలియలేదు. దాడి మీరే జరిపారంటూ తాలిబన్లు, సైన్యం పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి.


logo