మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 13:40:37

పాకిస్తాన్‌లో బ్లాస్ట్‌.. ఐదుగురు దుర్మరణం

పాకిస్తాన్‌లో బ్లాస్ట్‌.. ఐదుగురు దుర్మరణం

క్వెట్టా : పాకిస్తాన్‌లోని చమన్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్‌కు పాల్పడ్డారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

బ్లాస్ట్‌ జరుగడంతో సమీపంలోని మెకానిక్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. అయితే ఈ బ్లాస్ట్‌ ఎవరు, ఎందుకు చేశారో అనే అంశంపై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం చమన్ పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో దాడులు పెరిగిపోయాయి. జూలై 21న టర్బాట్ బజార్‌లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo