సోమవారం 01 జూన్ 2020
International - Apr 29, 2020 , 11:24:40

మార్కెట్లో బాంబు పేలి 40 మంది మృతి..

మార్కెట్లో బాంబు పేలి 40 మంది మృతి..

హైద‌రాబాద్‌: ఉత్త‌ర సిరియాలో జ‌రిగిన బాంబు పేలుడు సంఘ‌ట‌లో సుమారు 40 మంది పౌరులు మ‌ర‌ణించారు. దాంట్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ అఫ్రిన్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన‌ట్లు ట‌ర్కీ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. సిరియా కుర్దిష్ ద‌ళాలే ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు ట‌ర్కీ ఆరోపించింది. జ‌న‌సంద్రం క‌లిగిన ప్రాంతంలో బాంబును పేల్చారు. బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలో ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ అలుముకున్న‌ది. ఈ దాడిని అమెరికా ఖండించింది. రంజాన్ ఉపవాస దీక్ష‌లో భాగంగా షాపింగ్ చేసేందుకు వ‌చ్చిన వారిని టార్గెట్ చేస్తూ పేలుడుకు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  కుర్దిష్ మిలిటెంట్ల‌తో లింకున్న వైపీజీ ఉగ్ర‌వాద గ్రూపు.. ఉత్త‌ర సిరియాలో  సైనిక చ‌ర్య‌కు దిగిన‌ట్లు తెలుస్తున్న‌ది.    


logo