సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 22:48:12

అమెరికాలోని బాల్టిమోర్ లో పేలుడు

అమెరికాలోని బాల్టిమోర్ లో  పేలుడు

మేరీల్యాండ్ : బాల్టిమోర్ నగరంలోని నివాస ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడులో చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాల్టిమోర్ నగర అగ్నిమాపక విభాగం అధికారి బ్లెయిర్ ఆడమ్స్ ఈ సమాచారం ఇచ్చారు. ఇది సహజ వాయువు పేలుడు అని బాల్టిమోర్  అధికారులు చెప్తున్నారు. అయితే, పేలుడు ఎలా జరిగిందనే సమాచారం ఇంకా తెలియరాలేదు.

కొంతమంది పిల్లలతో పాటు ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానిక అగ్నిమాపక సిబ్బంది ట్వీట్ చేశారు. బాల్టిమోర్ ఫైర్ ఫైటర్స్ ఐఏఎఫ్ఎఫ్ లోకల్ 734 ముగ్గురు వ్యక్తులను రక్షించారు. బాల్టిమోర్ స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్స్ బృందం రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. వైద్య విభాగాల బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకున్నది.

ఈ సంఘటన గురించి తనకు ఇప్పుడే సమాచారం అందిందని బాల్టిమోర్ సిటీ మేయర్ ప్రతినిధి జేమ్స్ ఈ బెంట్లీ చెప్పారు. మొత్తం పరిస్థితికి సంబంధించి ఆయన అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు.logo