సోమవారం 08 మార్చి 2021
International - Jan 25, 2021 , 16:39:59

అనామక దాతల విరాళాలతో అధ్యక్షుడైన బైడెన్‌

అనామక దాతల విరాళాలతో అధ్యక్షుడైన బైడెన్‌

వాషింగ్టన్‌ : జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించడంలో పలువురు అనామక దాతలు కూడా ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. గుర్తుతెలియని దాతల నుంచి బైడెన్ రికార్డు మొత్తంలో విరాళాలు అందుకున్నారు. ఈ విరాళాల కారణంగా జో బైడెన్‌ పటిష్ఠమైన ప్రచారాన్ని చేపట్టి శ్వేతసౌధానికి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

యూఎస్‌ మీడియా నివేదికల ప్రకారం, అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బైడెన్‌ మొత్తం రూ.11వేల కోట్లు విరాళాలుగా అందుకున్నారు. వీటిలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచే దాదాపు రూ.10,500 కోట్లు (145 మిలియన్ డాలర్లు) వచ్చాయి. నిధులను సేకరించడం డెమోక్రాట్లకు ఎప్పుడూ కష్టమైన పనే. అయితే, బైడెన్‌ తొలిసారి 150 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ .10,950 కోట్లు) సేకరించారు. మరోవైపు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అందుకున్న విరాళాల్లో గుర్తుతెలియని ప్రజలు దాదాపు రూ.208 కోట్లు ఇచ్చారు. దీనికి ముందు, 2012 లో అనామక విరాళాల రికార్డు కూడా ఉన్నది. రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీకి 11.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.825 కోట్లు) లభించింది.

అవినీతిని అరికట్టడానికి నల్లధనాన్ని నిషేధించాలని కోరుకుంటున్నట్లు డెమోక్రాట్లు చెప్పారు. అయితే, ఎన్నికలు సమీపించగానే డెమోక్రాట్ పార్టీ నాయకులు ఈ వైఖరి నుంచి పక్కకు తప్పుకున్నారు. బైడెన్ ఎన్నికల ప్రచారంలో అందుకున్న విరాళాల నుంచి సగటున 2800 డాలర్లు (దాదాపు రూ.2.4లక్షలు) విరాళంగా ఇచ్చారంట. ఇందులో 200 డాలర్ల కంటే తక్కువ (దాదాపు 15 వేల రూపాయలు) విరాళం ఇచ్చిన వారి నుంచి 31.86 మిలియన్ డాలర్లు అంటే సుమారు 2 వేల 325 కోట్ల రూపాయలు వచ్చాయంట. 47 రాష్ట్రాల నుంచి పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఈ విరాళాలను సేకరించింది. డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో బైడెన్ 5 రెట్లు అధికంగా అనామక విరాళాలు అందుకున్నారు. మొత్తం మీద బైడెన్ పార్టీ డెమోక్రాటిక్ ఎన్నికల ప్రచారంలో నల్ల డబ్బు నుంచి 326 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.2,380 కోట్లు) లాభపడిందన్నమాట. రిపబ్లికన్ పార్టీ అందుకున్న 148 మిలియన్‌ డాలర్లకు ఇది రెట్టింపు.

ఇవి కూడా చదవండి..

రిపబ్లిక్‌ డే నాడు ఇద్దరు ప్రత్యేక అతిథులు.. ఎవరో తెలుసా?

నింగిలోకి దూసుకెళ్లి.. రికార్డు సృష్టించిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌

దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..

చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo