శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 22, 2020 , 16:47:10

చెట్టెక్కి పాటపాడిన ఎలుగుబంటి..!వీడియో

చెట్టెక్కి పాటపాడిన ఎలుగుబంటి..!వీడియో

న్యూయార్క్‌: ఎలుగుబంటి ఏంటి.. చెట్టెక్కి పాట పాడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే..ఓ గుడ్డేలుగు చెట్టెక్కి మరీ తన గాత్రం వినిపించింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ అరుదైన సంఘటన యూఎస్‌ఏలోని యోస్‌మైట్‌ పార్కులో జరిగింది. ఈ పార్క్‌లో సుమారు 300-500 ఎలుగుబంట్లు ఉన్నాయి. ఇందులో ఓ ఎలుగుబంటి గురువారం చకచకా చెట్టెక్కి పాడడం మొదలెట్టింది. దాదాపు నిమిషం పాటు పాటపాడింది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో ఈ వీడియోను ఇప్పటివరకూ వేలాదిమంది వీక్షించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.