ఆదివారం 07 మార్చి 2021
International - Feb 21, 2021 , 01:02:59

లక్ష కోట్ల డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌

లక్ష కోట్ల డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌

రికార్డు స్థాయికి మార్కెట్‌ విలువ

న్యూయార్క్‌/లండన్‌, ఫిబ్రవరి 20: బిట్‌కాయిన్‌ మార్కెట్‌ విలువ శనివారం ఏకంగా లక్ష కోట్ల డాలర్లను దాటింది. ఒక్క కాయిన్‌ ధర మునుపెన్నడూ లేనివిధంగా 56,620 డాలర్లకు చేరింది. దీంతో ఈ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకింది. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తమ సంస్థ బిట్‌కాయిన్‌పై 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నదని, బిట్‌కాయిన్‌ ద్వారా త్వరలో చెల్లింపులనూ అనుమతిస్తామని చేసిన ప్రకటన.. ఈ క్రిప్టోకరెన్సీ విలువను అమాంతం పెంచేసింది. గత రెండు నెలలుగా బిట్‌కాయిన్‌ విలువ క్రమేణా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వారం 18% పుంజుకోగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 92 శాతానికిపైగా ఎగబాకింది. 


VIDEOS

logo