మంగళవారం 19 జనవరి 2021
International - Dec 22, 2020 , 14:47:58

క‌రోనా మ్యుటేష‌న్‌ను అడ్డుకునే టీకా తెస్తాం : బ‌యోఎన్‌టెక్‌

క‌రోనా మ్యుటేష‌న్‌ను అడ్డుకునే టీకా తెస్తాం : బ‌యోఎన్‌టెక్‌

హైద‌రాబాద్‌: జ‌ర్మ‌నీకి చెందిన బ‌యోఎన్‌టెక్ ఫార్మా సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  క‌రోనా వైర‌స్ ముట్యేష‌న్‌ను అడ్డుకునే టీకాను త్వ‌ర‌లో రూపొందించనున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.   ఆరు వారాల్లోగా క‌రోనా వైర‌స్ మ్యుటేష‌న్‌ను నియంత్రించే టీకాను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు చెప్పింది.  అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీతో క‌లిసి బ‌యోఎన్‌టెక్ సంస్థ‌.. క‌రోనా వైర‌స్ టీకాను ఇటీవ‌ల రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ టీకాను ప‌లు దేశాల్లో పంపిణీ చేస్తున్నారు. అయితే తాజాగా బ్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో.. బ‌యోఎన్‌టెక్ సంస్థ ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు ప్రారంభం అయిన నాటి నుంచి కూడా మ్యుటేష‌న్ చెందుతున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. తాము త‌యారుచేయ‌బోయే కొత్త ర‌కం టీకా .. క‌రోనా ప‌రివ‌ర్త‌న‌ల‌ను అడ్డుకునే రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను సృష్టిస్తుంద‌ని ఉగురు సాహిన్ తెలిపారు. మెసెంజ‌ర్ టెక్నాల‌జీతో మ్యుటేష‌న్ అడ్డుకునే టీకాల‌ను సృష్టిస్తామ‌న్నారు. 

ఇవి కూడా చదవండి..

గర్భిణుల‌కు క‌రోనా వ్యాక్సిన్ ఇస్తారా? ఇవ్వరా?

66 ల‌క్ష‌ల కోట్ల కోవిడ్ ప్యాకేజీకు అమెరికా ఆమోదం

అక్కడికి కూడా కరోనా మహమ్మారి వచ్చేసింది!

కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఎందుకు అంత ప్ర‌మాద‌క‌రం?