శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 13, 2021 , 01:55:26

ముప్పు ముంగిట కీటకాలు

ముప్పు ముంగిట కీటకాలు

వాషింగ్టన్‌: ప్రకృతిలో ఆహార గొలుసుకు కీలకమైన కీటకాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాతావరణంలో మార్పులు, పంటపొలాల్లో క్రిమిసంహారక మందులను ఎక్కువగా వాడటం తదితర కారణాల వల్ల భూమిపై ఏటా ఒకటి నుంచి రెండు శాతం మేర కీటకాలు మరణిస్తున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార గొలుసు తెగిపోయి.. జీవవైవిధ్యం దెబ్బతింటుందన్నారు.  


logo