e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22

నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22

నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22

న్యూ మెక్సికో : వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లింది. వ‌ర్జిన్ గెలాక్టిక్‌ వ్య‌వ‌స్థాప‌కుడు రిచ‌ర్డ్ బ్రాన్‌స‌న్ బృందం రోద‌సి యాత్ర ప్రారంభమైంది. తెలుగమ్మాయి బండ్ల శిరీష స‌హా ఆరుగురు వ్యోమ‌గాముల‌తో న్యూమెక్సికో నుంచి వ‌ర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమ‌నౌక రోద‌సీలోకి ప‌య‌నమైంది. మొద‌ట‌గా వీఎంఎస్ ఈవ్ విమానం యూనిటీ-22ను 15 కిలోమీట‌ర్ల ఎత్తుకు తీసుకువెళ్ల‌నుంది. రాకెట్ ఇంజిన్ ప్ర‌జ్వ‌ల‌నంతో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ మ‌రింత ఎత్తుకు వెళ్ల‌నుంది. చివ‌రిద‌శ‌లో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ సొంత ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నుంది.

యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావ‌డం అదృష్ట‌మంటూ శిరీష ట్వీట్ చేసింది. భూమికి 90 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ వీళ్లు వెళ్ల‌నున్నారు. అక్క‌డ కొన్ని నిమిషాల భార ర‌హిత స్థితిలో ఉన్న త‌ర్వాత తిరిగి భూమి వైపు ప్ర‌యాణం కానున్నారు. ఈ మొత్తం ప్ర‌యాణం 90 నిమిషాల్లో ముగుస్తుంద‌ని గ‌తంలో బ్రాన్స‌న్ వెల్ల‌డించారు.

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష‌ కొన్నాళ్లుగా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, రీసెర్చ్ ఆప‌రేష‌న్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా ప‌ని చేస్తున్నారు. శిరీష 2015లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల మేనేజ‌ర్‌గా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. ఈ మ‌ధ్యే 747 ప్లేన్ ఉప‌యోగించి అంత‌రిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్ట‌న్ ఆప‌రేష‌న్స్‌ను కూడా చూసుకుంటోంది. ప‌ర్‌డ్యూ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్, జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

ఇప్పుడు శిరీష ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకోబోతోంది. స్పేస్‌లో అడుగుపెట్ట‌బోతున్న రెండో భార‌తీయ‌ మ‌హిళ కాగా.. ఓవ‌రాల్‌గా నాలుగో ఇండియ‌న్‌. మ‌న దేశం త‌ర‌ఫున రాకేశ్ శ‌ర్మ అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి వ్య‌క్తి కాగా.. క‌ల్పనా చావ్లాతో పాటు మ‌రో ఇండియ‌న్‌-అమెరిక‌న్ ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్ కూడా ఈ ఘ‌న‌త సాధించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22
నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22
నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22

ట్రెండింగ్‌

Advertisement