శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 24, 2020 , 12:56:05

మోదీ, ట్రంప్‌, జిన్‌పింగ్‌పై విరుచుకుప‌డ్డ బిలియ‌నీర్‌

మోదీ, ట్రంప్‌, జిన్‌పింగ్‌పై విరుచుకుప‌డ్డ బిలియ‌నీర్‌
  • 100 కోట్ల డాల‌ర్లతో వ‌ర్సిటీ ఏర్పాటు

హైద‌రాబాద్‌: బిలియ‌నీర్ జార్జ్ సోర‌స్ మేటి ప్ర‌పంచ దేశాధినేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు.  అనేక రాజ‌కీయ‌, సాంకేతిక స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న త‌న ప్ర‌సంగంలో స్పందించారు.  భార‌త ప్ర‌ధాని మోదీ.. జాతీయ‌వాదాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు.  ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌ధాని మోదీ.. హిందూ దేశాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. ముస్లింల ప్ర‌భావితం ఉన్న‌ క‌శ్మీర్‌పై తీవ్ర ఆంక్ష‌లు విధిస్తున్నార‌న్నారు. పౌర‌స‌త్వ చ‌ట్టం పేరుతో ల‌క్ష‌ల సంఖ్య‌లో ముస్లింల‌ను వేధిస్తున్నార‌న్నారు. 

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. అధికార దాహంతో ఉన్నార‌ని బిలియ‌నీర్ జార్జ్ సోర‌స్ ఆరోపించారు. త‌న చుట్టు ఉన్న‌వారిని మోసం చేస్తున్నార‌న్నారు. దేశాధ్య‌క్షుడు కావాల‌న్న కాంక్ష నిజ‌మైన త‌ర్వాత‌.. ట్రంప్ మ‌రింత అధికార దాహాంతో విర్ర‌వీగుతున్నార‌ని ఆరోపించారు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ట్రంప్ దెబ్బ‌తీస్తున్నార‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ట్రంప్ ఏమైనా చేస్తార‌ని, స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం దేశ ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్నార‌న్నారు.  ట్రంప్ బ‌ల‌హీన‌త‌ను చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ చాక‌చ‌క్యంగా వాడుకుంటున్నార‌న్నారు. కృత్రిమ మేధ‌తో అమెరికాపై చైనా పెత్త‌నం చేస్తున్న‌ద‌న్నారు.  బిలియ‌నీర్ జార్జ్ సోర‌స్ ఓ యూదు మ‌త‌స్తుడు.  అత‌ను ఓ గొప్ప దాతృత్వం క‌లిగిన వ్య‌క్తి.  అమెరికా, యూరోప్‌కు ఆయ‌న బిలియ‌న్ల డాల‌ర్లు దానం చేశారు. ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం వాటిని ఖ‌ర్చు చేశారు. 

ట్రంప్‌, పుతిన్‌, జిన్‌పింగ్‌, మోదీ లాంటి నియంత‌ల‌పై పోరాటం చేసేందుకు 100 కోట్ల డాల‌ర్లతో వ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సోర‌స్ తెలిపారు.  ఓపెన్ సోసైటీ యూనివ‌ర్సిటీ నెట‌వ‌ర్క్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఈ వ‌ర్సిటీ ద్వారా అణ‌గారిన వ‌ర్గాలు ఉన్న‌త విద్య‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిపారు. 


logo