సోమవారం 01 జూన్ 2020
International - Apr 27, 2020 , 17:16:38

అమెరికాను త‌ప్పుబ‌ట్టిన బిల్‌గేట్స్‌

అమెరికాను త‌ప్పుబ‌ట్టిన బిల్‌గేట్స్‌

క‌రోనా వైర‌స్ పుట్టుక‌కు చైనానే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ప‌లు దేశాలు ఆరోపిస్తున్న క్ర‌మంలో మైక్రోసాప్ట్  వ్య‌వ‌స్థ‌పాకుడు  బిల్‌గేట్స్ అందుకు భిన్నంగా స్పందించారు. ఇలాంటి క్లిష్ట‌సమయంలో విమ‌ర్శ‌లు స‌రికాదని అభిప్రాయ‌ప‌డ్డారు. అంద‌రూ స‌మిష్టిగా కృషిచేస్తేనే క‌రోనాపై విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. చైనాలో వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన త‌రుణంలో చైనా స‌రైన చ‌ర్య‌లే చేప‌ట్టింద‌న్నారు. అయితే  అమెరికా మాత్రం క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌లం అయ్యింద‌న్నారు. క‌రోనా  కట్ట‌డికి స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలిపారు.  

కరోనా వ్యాప్తి చెందకుండా కొన్ని దేశాలు చాలా వేగంగా స్పందించాయని.. దాంతో, భారీ ఆర్థిక నష్టం నుంచి బయటపడ్డాయని పేర్కోన్నారు. అమెరికా అధ్యక్షుడు కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చైనాపై ఆరోపణలు చేయడం వల్ల లక్ష్యం నుంచి పక్కదారి పట్టించడమే అవుతుందనే తన అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆరోప‌ణ‌లు మానుకొని మానవాళిని రక్షించే శాస్త్ర సాంకేతికకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగాల్సిన తరుణమిదేనన్నారు. 


logo