గురువారం 28 మే 2020
International - May 21, 2020 , 19:17:52

ఇదే నేను చదువుతున్న పుస్తకం: బిల్‌గేట్స్‌

ఇదే నేను చదువుతున్న పుస్తకం: బిల్‌గేట్స్‌

వాషింగ్టన్‌: ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు ఇష్టపడే మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, అపర దానకర్ణుడైన బిల్‌ గేట్స్‌.. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సందర్భంలో తనకిష్టమైన పుస్తకాలను చదివేందుకు సమయం దొరికిందని సంబురపడిపోయాడు. ఇప్పటికే ఎన్నో పుస్తకాలను చదివి జీర్ణం చేసుకొన్నతాను.. లాక్‌డౌన్‌ వేళ మరెన్నో పుస్తకాలు చదివేందుకు వీలుచిక్కిందని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నా ప్రతి ఏటా చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పుస్తకాలు చదివేందుకు, ఇష్టమైన  సినిమాలు, డాక్యుమెంటరీలు చూసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నట్టు తెలిపారు.

వేసవి కాలంలో చదివేందుకు సిద్ధం చేసుకొన్న పుస్తకాల జాబితాలోని ఐదు పుస్తకాలను చదివి సమీక్షలు రాసేశానని, మరిన్ని చదివి రివ్యూలు రాసే వీలు చిక్కిందని బిల్‌ గేట్స్‌ తన బ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుత కొవిడ్‌ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు, మంచి కార్యక్రమాలు చేసేందుకు ఉపయోగించాలని, సవాళ్లు, పోరాటపటిమ కలిగిన అంశాలను నేర్చుకోవడం నిత్యం జరుగుతూనే ఉండాలని సూచిస్తున్నారు. వ్యాపార పాఠాలను మనమంతా బిల్‌గేట్స్‌కు సంబంధించిన పుస్తకాల నుంచి చదివి నేర్చుకొంటే.. ఆయన మాత్రం  వాల్ట్‌ డిస్నీ సంస్థ సీఈవోగా 15 ఏండ్ల ప్రస్థానంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకొన్న పాఠాలపై రాబర్ట్ ఐజర్‌ రాసిన ది  రైడ్‌ ఆఫ్‌ ఏ లైఫ్‌టైం అనే పుస్తకాన్ని బిల్‌గేట్స్‌ చదువుతున్నారట. 


logo