వాషింగ్టన్, జూన్ 13: అమెరికాలో అతిపెద్ద రైతు ఎవరో తెలుసా.? బిల్ గేట్స్. అవును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్సే అమెరికాలో అతిపెద్ద రైతు. బిల్గేట్స్, తన భార్య మెలిండా(ఇంకా విడాకులు చట్టబద్ధంగా మంజూరు కాలేదు) పేర ఉన్న వ్యవసాయ భూమి అక్షరాలా రెండు లక్షల ఆరవై తొమ్మిది వేల ఎకరాలు. గడిచిన పదేండ్లలోనే ఈ 2,69,000 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ భూములు అమెరికాలోని 18 రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి. ఉత్తర లూసియానాలో 70 వేలు ,వాషింగ్టన్లో 14 వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు న్నాయి. అందులో సోయాబీన్, ఆలుగడ్డలు పండిస్తున్నారు. ఈ భూ ములు అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత విస్తీర్ణంలో ఉన్నాయని ఓ వార్తా సంస్థ పేర్కొంది.