సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 18:24:18

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్ర కీలకమైంది : బిల్ గేట్స్

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్ర కీలకమైంది : బిల్ గేట్స్

న్యూఢిల్లీ : ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద సంఘటనగా కరోనా వైరస్ వ్యాప్తి అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్న భారత సంకల్పం అభివృద్ధి చెందిన దేశాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రపంచంలో అంటువ్యాధిని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. టీకా సిద్ధమైన తర్వాత ప్రపంచం మొత్తం దాని ఉత్పత్తి కోసం భారతదేశంపై దృష్టి పెడుతుందని చెప్పారు.

భారతదేశంలో సురక్షితమైన, సమర్థమైన వ్యాక్సిన్‌ను త్వరగా తయారు చేయాలని మనమందరం కోరుకుంటున్నామని బిల్ గేట్స్ తెలిపారు. వచ్చే ఏడాది అంటే 2021 తొలి త్రైమాసికంలో టీకా రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేము వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా అందుబాటులో ఉండేలా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. అయితే దానిని పంపిణీ చేసే మార్గం ఏమిటో నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు.

సీరం ఇన్స్టిట్యూట్‌తో చేతులు కలిపాం

ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటైన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో కరోనాపై పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ఫౌండేషన్ భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్తో చేతులు కలిపింది. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ లేదా నోవావాక్స్ లేదా జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వచ్చిన టీకా ఉత్పత్తిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.


logo