మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 20:02:27

ఫ్రెండ్‌కోసం కేక్ త‌యారు చేసిన బిల్‌గేట్స్‌.. అత‌నంటే ఎంతిష్ట‌మో!

ఫ్రెండ్‌కోసం కేక్ త‌యారు చేసిన బిల్‌గేట్స్‌.. అత‌నంటే ఎంతిష్ట‌మో!

మ‌న‌కు బాగా ఇష్ట‌మైన వారికి అంద‌రికంటే స్పెష‌ల్‌గా విషెస్ చెప్పాల‌ని ఉంటుంది. అందుకు ప్ర‌త్యేకంగా చేతులతో త‌యారు చేసింద‌యితే మ‌రింత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఆనందాల‌ను సామాన్యులే కాదు పెద్దోళ్లు కూడా ఆస్వాదిస్తారు. ఇటీవ‌ల ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త బిల్‌గేట్స్ త‌న ఫ్రెండ్ వారెన్ బ‌ఫెట్ 90వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్వ‌యంగా ఓరియో కేక్ త‌యారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

నిమిషం పాటు న‌డిచే ఈ వీడియోలో బిల్‌గేట్స్ ఎంతో అనుభ‌వం ఉన్న చెఫ్‌గా కేక్ త‌యారు చేయ‌డం గ‌మ‌నార్హం. బిల్‌గేట్స్‌ ఈ వీడియోను స్వ‌యంగా త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి “90 వ పుట్టినరోజు శుభాకాంక్షలు, వారెన్!” అనే శీర్షిక‌ను జోడించారు. బిల్‌గేట్స్ ఆప్రాన్ ధ‌రించి కిచెన్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. త‌ర్వాత పిండిని జ‌ల్లడం, చాక్లెట్ బార్ క‌త్తిరించ‌డం వ‌ర‌కు అత‌ని ప్ర‌తీది చేశారు. చివ‌రిగా కేక్ ఎంతో క‌ల‌ర్‌ఫుల్‌గా స‌రైనా ఆకారానికి తీసుకువ‌చ్చారు. ఫైన‌ల్‌గా కేక్‌తో కెమెరాకు ఫోజిలిచ్చి కేక్ పీస్‌ను క‌ట్ చేశారు. ఇది కేవ‌లం కేక్ మాత్ర‌మే కాదు. అత‌ని ప్రేమానురాగాలు కూడా క‌లిసున్నాయ‌ని తెలుస్తుంది. కానీ ఫ్రెండ్‌కోసం బిల్‌గేట్స్ కేక్ త‌యారు చేయ‌డంతో నెటిజ‌న్ల ప్ర‌సంశ‌లు అందుకుంటున్నారు.    


logo