గురువారం 28 మే 2020
International - Apr 27, 2020 , 13:10:24

12 నెల‌ల్లో గేట్స్ వాక్సిన్‌

12 నెల‌ల్లో గేట్స్ వాక్సిన్‌

ప్ర‌పంచ కుబేరుడు బిల్‌గేట్స్ క‌రోనాపై పోరు ప్ర‌క‌టించారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాను క‌ట్ట‌డిచేసే వ్యాక్సిన్ త‌యారీ కోసం ఆయ‌న భారీగా నిధులు వెచ్చిస్తున్నారు.  వ్యాక్సిన్ త‌యారీలో త‌ల‌మున‌క‌లుగా ఉన్న ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు ఆయ‌న నిధులు అంద‌జేస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని ఆయ‌న బిల్‌గేట్స్ ప్ర‌క‌టించారు. అయితే గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన‌ట్లుగా వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సాధ్యం కాద‌ని ఆయ‌న తెలిపారు.  


logo