మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 24, 2020 , 16:07:12

బిహార్లో బీజేపీ హామీని నకలు కొట్టిన జో బిడెన్

బిహార్లో బీజేపీ హామీని నకలు కొట్టిన జో బిడెన్

వాషింగ్టన్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ అమెరికా వరకు చేరింది. అక్కడ కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ .. బీజేపీ హామీని కాపీ కొట్టారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన పక్షంలో అందరకీ ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందిస్తానని హామీ ఇచ్చారు. 

నవంబర్ 3 న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా వైరస్ అతిపెద్ద సమస్యగా కనిపిస్తుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ, పరిశుభ్రతపై కన్నేయగా.. ట్రంప్ పరిపాలన కరోనాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని డెమోక్రాట్ అభ్యర్థి బిడెన్ ఆరోపిస్తున్నారు. నేను అధ్యక్షుడనైతే ప్రతి అమెరికన్ ఉచితంగా టీకాలు పొందేలా చేస్తానని చెప్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వం వ్యాక్సిన్‌ను పూర్తిగా కొనుగోలు చేస్తుందని నేను హామీ ఇస్తున్నానన్నారు. అవసరమైన వారికి ముందుగా ఈ టీకా ఇవ్వబడుతుందని, అంటువ్యాధిని ట్రంప్ ఎగతాళి చేశారని,  దానిని తీవ్రంగా పరిగణించలేదని జో బిడెన్ ఆరోపించారు. మన ముందు పెద్ద ప్రమాదం ఉన్నదని, రాబోయే శీతాకాలంలో కరోనా వైరస్ మరింత ప్రమాదకరమైనదిగా  తయరయ్యేందుకు అవకాశాలునందున.. దీనిని ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధం కావాలని జో బిడెన్ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.