పారిస్: ఫ్రాన్స్‌లోని ఓ కోర్టు ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియాకు 10 లక్షల యూరోలు (సుమారు రూ.8.90 కోట్లు) జరిమానా విధించింది. తమకు సమస్యాత్మకంగా మారిన కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, అసంతృప్త వినియోగదారులపై నిఘా పెట్టి, వారి వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరించినట్టు మోపిన అభియోగం రుజువు కావడంతో జరిమాన, నష్ట పరిహారం కింద ఈ సొమ్ము చెల్లించాలని ఆదేశించింది. ఐకియాకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మరికొందరికి సస్పెండెడ్ జైలు శిక్ష విధించింది.