గురువారం 04 జూన్ 2020
International - Apr 04, 2020 , 09:19:45

క‌రోనాతో విలవిల్లాడుతున్న స్పెయిన్‌

 క‌రోనాతో విలవిల్లాడుతున్న స్పెయిన్‌

కరోనా మ‌హ‌మ్మారితో స్పెయిన్‌ విలవిల్లాడిపోతోంది. ప్ర‌తిరోజూ అంతకంతకూ క‌రోనా కేసులు పెరిగిపోతుండగా... మరోవైపు జ‌నం పిట్టల్లా రాలిపోతున్నారు. అక్క‌డ‌ మార్చి 14 నుంచి స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న కూడా... రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7,134 పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం 77,488 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వీళ్లలో 6,416 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా వైరస్‌ వల్ల మార్చి 17 నుంచి రోజూ వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. మార్చి 23 నుంచి రోజూ 500కు తక్కువ కాకుండా జనం చనిపోతున్నారు. గత ఐదురోజులుగా చూసుకుంటే దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 14 వేలకు పైగా కరోనా మరణాలతో ఇటలీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే... స్పెయిన్‌ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లోఇప్ప‌టి వ‌ర‌కు 11,198 మంది కరోనాతో చనిపోయారు. అటు 80 వేల మంది హెల్త్‌ వర్కర్లుకు కరోనా వైరస్ సోకడం వల్ల విధులకు దూరమయ్యారు.logo