వాషింగ్టన్: ఫుట్బాల్ స్టేడియం అంత పరిమాణమున్న ఒక భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్నది. ఈ నెల 24న ఇది భూమికి అత్యంత చేరువగా వెళ్లనున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ‘2008 గో20’గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ వ్యాసం 20 మీటర్లు. ఇది భూమికి 2,87,08,47,607 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే ఇది 8 రెట్లు ఎక్కువ. భూమి వైపు ఇది సెకనుకు 8 కిలోమీటర్ల వేగంతో వస్తున్నది. భూమిని తాకే ప్రమాదం లేకపోయినప్పటికీ ఆస్టరాయిడ్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు నాసా తెలిపింది.