సోమవారం 08 మార్చి 2021
International - Jan 20, 2021 , 20:15:13

17 అంశాలపై బైడెన్‌ తొలి సంతకం

17 అంశాలపై బైడెన్‌ తొలి సంతకం

వాషింగ్టన్‌‌: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు బైడెన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. ప్రమాణస్వీకారం ముగియగానే డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను పక్కనపెట్టేలా కొత్త కార్యాచరణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో చాలా వరకు ట్రంప్‌ తీసుకొచ్చిన విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండనున్నాయని అధికారులు చెప్తున్నారు.

పారిస్ వాతావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల పునరుద్ధరణ చేయడం వంటి ఆదేశాలు జారీ చేయాలని జో బైడెన్‌ యోచిస్తున్నట్లు ఆయన అంతరంగీకులు తెలిపారు. కరోనా వైరస్‌ గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలు చేసిన ట్రంప్‌.. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే, దీనిపై పునరాలోచన చేసి డబ్ల్యూహెచ్‌ఓలో చేరడమే కాకుండా నిధులు ఇవ్వడంపై కూడా బైడెన్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

ముస్లిం దేశాల నుంచి వ‌చ్చేవారిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ఆ దేశ స‌రిహ‌ద్దుల్లో భారీ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ట్రంప్‌ మానసపుత్రికగా భావించే ఈ ప్రాజెక్టును బైడెన్‌ పక్కన పెట్టేయనున్నట్లు తెలిసింది. 

ఒకవైపు కొవిడ్‌ విజృంభిస్తున్నా ట్రంప్‌ మాత్రం ముఖానికి మాస్కు పెట్టుకోనంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీన్ని ఆయన చాలా సార్లు తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదంటూ బహిరంగంగా చెప్పారు. అయితే, బైడెన్‌ అధికారంలోకి రాగానే ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు 100 రోజుల పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసేలా ఆదేశాలివ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. 

ఇవేకాకుండా వలస విధానాలను పునరుద్ధరించడానికి, దేశంలో నివసిస్తున్న లక్షలాది మంది నమోదుకాని వలసదారులకు పౌరసత్వం ఇవ్వడానికి మార్గం సుగమం చేసేందుకు కాంగ్రెస్‌కు బిల్లు పంపాలని బైడెన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఇవి కూడా చదవండి.. 

బైడెన్ ఈవెంట్‌కు ఎంత మంది వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌వుతున్నారో తెలుసా ?

వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర మీకు తెలుసా!

కమలా హ్యారిస్‌.. కొన్ని ఆసక్తికర విషయాలు

బైడెన్ స‌క్సెస్ సాధించాలని ఆశిస్తున్నా: డోనాల్డ్ ట్రంప్‌

చివ‌రి రోజు.. 73 మందికి క్ష‌మాభిక్ష పెట్టిన ట్రంప్‌

ట్రంప్‌ రిటైర్‌మెంట్.. బిడ్డ ఎంగేజ్‌మెంట్‌..!

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo