ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 20, 2021 , 22:30:38

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌‌ ప్రమాణం

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌‌ ప్రమాణం

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భార్య సమక్షంలో కుటుంబానికి చెందిన పురాతన బైబిల్‌ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌లో జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు ముందు ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ ప్రమాణం చేశారు. ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. అయితే తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ట్రంప్‌ వైఖరి, క్యాపిటల్‌పై ఆయన మద్దతుదారుల దాడి నేపథ్యంలో బైడెన్‌, కమలా ప్రమాణ స్వీకారానికి అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లేడీ గగా జాతీయ గీతం ఆలపించగా , జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో అలరించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo