బుధవారం 24 ఫిబ్రవరి 2021
International - Jan 24, 2021 , 19:02:21

జాన్స‌న్‌కు బైడెన్ ఫోన్‌: స‌్వేచ్ఛా వాణిజ్య బంధంపై చ‌ర్చ‌లు!

జాన్స‌న్‌కు బైడెన్ ఫోన్‌: స‌్వేచ్ఛా వాణిజ్య బంధంపై చ‌ర్చ‌లు!

వాషింగ్ట‌న్‌/ ల‌ండ‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ శ‌నివారం బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాల మ‌ధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డం వ‌ల్ల ఒన‌గూడే ప్ర‌యోజ‌నాలపై చ‌ర్చించారు. అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడిన తొలి యూరోపియ‌న్ నేత బోరిస్ జాన్స‌న్ కావ‌డం విశేషం. 

జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన త‌ర్వాత బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా  స్పందించారు. ‘అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో మాట్లాడ‌టం గొప్ప‌గా ఉంది. మా రెండు దేశాల మ‌ధ్య సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న భాగ‌స్వామ్యం మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ముంద‌డుగు వేయ‌డానికి వేచి చూస్తున్నా. క‌రోనా నుంచి రెండు దేశాలు రిక‌వ‌రీ సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. 

అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డాన్ని ప్ర‌ధాని జాన్స‌న్ అభినందించార‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య అధికార ప్ర‌తినిధి తెలిపారు. భూతాప నివార‌ణ‌కు జ‌రిగిని పారిస్ ఒప్పందంలో తిరిగి భాగ‌స్వామి కావాల‌ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణ‌యాన్ని బోరిస్ జాన్స‌న్ స్వాగ‌తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo