గురువారం 28 మే 2020
International - May 08, 2020 , 08:48:55

బైడెన్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు.. అధ్య‌క్ష రేసు నుంచి త‌ప్పుకోవాల‌న్న బాధితురాలు

బైడెన్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు.. అధ్య‌క్ష రేసు నుంచి త‌ప్పుకోవాల‌న్న బాధితురాలు

హైద‌రాబాద్‌: ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్‌ రేసులో నిలుచున్న విష‌యం తెలిసిందే. అయితే బైడెన్‌పై ఓ  మహిళ లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. 27 ఏళ్ల క్రితం బైడెన్ త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు 56 ఏళ్ల తారా రీడ్ ఆరోపించింది. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన బైడెన్‌.. అమెరికా అధ్య‌క్ష రేసు నుంచి త‌ప్పుకోవాలంటూ తారా డిమాండ్ చేసింది. ఒక అడుగు ముందుకు వేసి.. చేసిన త‌ప్పుకు బాధ్య‌త తీసుకోవాల‌ని బైడెన్‌ను ఆమె డిమాండ్ చేసింది. ఇలాంటి వ్య‌క్తిత్వం ఉన్న వాళ్లు అమెరికా అధ్య‌క్షులు కావొద్దు అని ఆమె పేర్కొన్న‌ది. 

1992-93 సంవ‌త్స‌రంలో యూఎస్ సేనేట‌ర్‌గా ఉన్న బైడెన్‌కు స్టాఫ్ అసిస్టెంట్‌గా తారా రీడ్ ప‌నిచేశారు.  అయితే ఓ రోజు బైడెన్ త‌నతో అనుచిత రీతిలో ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆమె ఆరోపించింది. త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడికి సంబంధించిన అంశాల‌ను ఆమె మీడియాతో కూలంకుషంగా వెల్ల‌డించింది. శారీర‌కంగా దాడి చేసి.. త‌న‌తో శృంగారం కోరుకుంటున్న‌ట్లు బైడెన్ వేధించార‌ని తారా ఆరోపించింది. బైడెన్ దాడికి సంబంధించి లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు కూడా తాను సిద్ధ‌మే అని ఆమె తెలిపింది.  బైడెన్ ఆ ప‌రీక్ష‌కు సిద్ధ‌మైతే, నేను కూడా సిద్ద‌మే అన్న‌ది.  బైడెన్ మ‌ద్ద‌తుదారుల నుంచి బెదిరింపులు వ‌స్తున్న‌ట్లు ఆమె చెప్పింది.logo