సోమవారం 30 మార్చి 2020
International - Mar 19, 2020 , 02:00:41

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌!

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌!

  • డెమోక్రటిక్‌ పార్టీలో శాండర్స్‌పై బిడెన్‌ దూకుడు 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కానున్నారు. ఆయన సొంత రాష్ట్రం ఫ్లోరిడాలో అభ్యర్థిత్వానికి అవసరమైన 122 మంది రిపబ్లికన్‌ పార్టీ డెలిగేట్ల మద్దతు పొందారు. జాతీయ స్థాయి లో ట్రంప్‌కు 1,330 మంది రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధుల మద్దతు లభించింది. రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష పదవికి పోటీ చేసే నేత 1,276 మం ది ప్రతినిధుల మద్దతు పొందాలి. వచ్చే ఆగస్టులో జరిగే రిపబ్లికన్‌ పార్టీ సదస్సు లో లాంఛనంగా ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్నారు. కాగా, డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ నిలిచేందుకు మార్గం సుగమమైంది. బిడెన్‌ 3 కీలక రాష్ర్టాల్లో సెనెటర్‌ శాండర్స్‌పై గెలుపొందారు. జాతీయంగా బిడెన్‌కు 1,121 డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల మద్దతు, శాండర్స్‌కు 839 మంది ప్రతినిధుల మద్దతు లభించింది. 


logo