శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 08:24:49

అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్‌ కంటే వెనుకబడ్డ ట్రంప్‌!

అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్‌ కంటే వెనుకబడ్డ ట్రంప్‌!

వాషింగ్టన్‌: వచ్చే నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి గెలువడం కష్టంగానే కనిపిస్తున్నది. అమెరికాను విలవిల్లాడిస్తున్న కరోనా మహమ్మారి అధ్యక్షుడి పీఠానికి ఎసరు పెట్టనున్నది. వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్‌ విఫలమయ్యారని వాషింగ్టన్‌ పోస్ట్‌, ఏబీసీ న్యూస్‌ నిర్వహించిన ఓ సర్వేలో మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ ఈ విపత్తును ఇంకా మెరుగ్గా ఎదుర్కొనే వారని వాళ్లు అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్‌కే తమ మద్దతు అని సర్వేలో పాల్గొన్న 55 శాతం మంది తెలిపారు.


logo