శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 18:36:49

లైంగికవేధింపుల ఆరోప‌ణ‌లు నిరాధారంః జో బిడెన్

లైంగికవేధింపుల ఆరోప‌ణ‌లు నిరాధారంః జో బిడెన్

వ‌చ్చే న‌వంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న జోబిడెన్ త‌న‌పై వ‌చ్చిన లైంగిక‌వేధింపుల ఆరోప‌ణ‌లు ఖండించారు. మాజీ సెనేట్ ఉద్యోగి తారా రీడ్ చేసిన ఆ ఆరోప‌ణ‌ల్లో నిజంలేద‌ని స్ప‌ష్టంచేశారు. అధ్య‌క్ష అభ్య‌ర్థి అయిన త‌ర్వాత మొద‌టిసారి ఆయ‌న ఓ టీవీ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌బోతున్నారు. ఆ ముఖాముఖిలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స‌మాధానం ఇవ్వ‌నున్నారు. త‌న‌పై అలాంటి ఫిర్యాదు రికార్డు అయ్యిందేమో నేష‌న‌ల్ ఆర్కైవ్‌లో వెతుక్కోవాల‌ని త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు సూచించారు. 


logo