బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 15:34:47

రోడ్డు మీద‌ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ఫొటోషూట్‌.. యాక్సిడెంట్ జ‌రిగినా ప‌ట్టించుకోలేదు

రోడ్డు మీద‌ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ఫొటోషూట్‌.. యాక్సిడెంట్ జ‌రిగినా ప‌ట్టించుకోలేదు

ఈ రోజుల్లో ప్ర‌తిదానికి ఫొటోషూట్ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. ఇది వ‌ర‌కు పెళ్లిలో ఫోటోలు తీసుకునేవారు. త‌ర్వాత ఇంకా ఏదైనా చిన్న ఫంక్ష‌న్లు జ‌రిగితే ఫొటోషూట్ఉండేది. ఇప్పుడు సంద‌ర్భం ఉన్నా లేకున్నా ఫోటోషూట్ మాత్రం ప్ర‌ముఖ పాత్ర వ‌హిస్తుంది.  ఈ జంట త‌మ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ సీన్‌ను త‌ర్వాత త‌రానికి కూడా చెప్పుకునే విధంగా ఉండాల‌ని ఫోటోషూట్ నిర్వ‌హించారు. అయితే అది న‌డిరోడ్డు మీద అయ్యేస‌రికి వ‌చ్చి, పోయే వాహ‌నాలు ఆ ఫొటోగ్రాఫ‌ర్ల‌ను ఢీ కొడుతున్నా పాపం ప‌ట్టించుకోకుండా ప‌నిచేస్తున్నారు.

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ వంతెన‌పై ఓ వ్య‌క్తి, అమ్మాయిని వివాహం చేసుకుంటావా అని అడుగుతుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను వ‌రుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'మీరు మీ ప్ర‌పోజ‌ల్‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోకూడ‌దు అనుకుంటే న్యూయార్క్‌లో ప్ర‌పోజ్ చేయండి' అనే శీర్షిక‌ను జోడించారు. మోకాలి మీద కూర్చొని త‌న స్నేహితురాలి క‌ళ్ల‌లోకి చూస్తూ డైలాగ్ చెబుతుండ‌గా ఫొటోగ్రాఫ‌ర్ ఫోటోలు తీస్తున్న‌ది. ఆ స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న సైకిల్ రైడ‌ర్ ఆమెను ఢీకొట్టాడు. కింద‌ప‌డిన ఆమె లేచి మ‌రీ ఫొటోలు తీయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 


logo