మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 21:26:37

భూటాన్‌లో తొలిసారి లాక్‌డౌన్‌

భూటాన్‌లో తొలిసారి లాక్‌డౌన్‌

థింపూ : కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు భూటాన్‌లో తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నందుకు ప్రజలు సహకరించాలని భూటాన్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో సహకరించి 21 రోజుల పాటు ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భూటాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఇటీవల దుబాయ్‌, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరి ద్వారా భూటాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ 5 నుంచి 21 రోజులపాటు అమలులో ఉంటుందని తెలిపింది. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినవారు, విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. దేశంలోని 7.5 లక్షల మంది జనాభా ఇండ్లకే పరిమితం కావాలని, పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేసి ప్రభుత్వంతో సహకరించాలని భూటాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.


logo