గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 18, 2020 , 10:04:04

వాతావ‌ర‌ణ మార్పులు.. 10 బిలియ‌న్ల డాల‌ర్లు ఇచ్చిన బేజోస్‌

వాతావ‌ర‌ణ మార్పులు.. 10 బిలియ‌న్ల డాల‌ర్లు ఇచ్చిన బేజోస్‌

హైద‌రాబాద్‌:  వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాటం చేసేందుకు అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బేజోస్ 10 బిలియ‌న్ల డాల‌ర్ల‌(సుమారు72వేల కోట్లు)తో ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.  త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బేజోస్ ఈ విష‌యాన్ని చెప్పారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం శ్ర‌మించే శాస్త్ర‌వేత్త‌లు, కార్య‌క‌ర్త‌లు, ఎన్జీవోలు.. ఆ నిధుల‌ను వాడుకోవ‌చ్చు అన్నారు. భూగోళానికి వాతావ‌ర‌ణ మార్పు పెద్ద స‌మ‌స్య అని తెలిపారు. బేజోస్ ఆస్తుల విలువ సుమారు 130 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంది. ఇంటి వ‌ద్ద‌కే వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేస్తున్న అమెజాన్ సంస్థ వ‌ల్ల చాలా వ‌ర‌కు వ్య‌ర్థాలు మిగిలిపోతున్నాయ‌ని, ఆ సంస్థ వాడే వాహ‌నాల వ‌ల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతోంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌న వంతు కృషిగా ప‌ది బిలియ‌న్ల డాల‌ర్లు ఇస్తున్న‌ట్లు బేజోస్ చెప్పారు. 


logo