e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News కోలాహ‌లంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌..!

కోలాహ‌లంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌..!

బెర్లిన్: కరోనా మ‌హ‌మ్మారి తగ్గుముఖం పట్టడంతో యూరప్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దాంతో కొద్ది నెలలుగా జర్మనీలో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. తాజాగా సామాజిక, సాంస్కృతి కార్య‌క్ర‌మాల‌కు కూడా స‌డ‌లింపులు ల‌భించ‌డంతో బెర్లిన్ అంత‌ర్జాతీయ‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను కోలాహలంగా నిర్వ‌హించారు. వాస్త‌వానికి గ‌త మార్చిలో జ‌రుగాల్సిన ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదావేసి తాజాగా నిర్వ‌హించారు.

ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ‘హర్ బచ్ మాన్’ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మెప్పు పొంది అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ‘హర్ బచ్ మాన్’ సినిమా ఓ టీచర్, ఆరో తరగతి విద్యార్థుల చుట్టూ తిరిగే క‌థ‌తో కూడిన‌ డాక్యుమెంటరీ. ఇక ‘ఐయామ్ యువర్ మ్యాన్ ‘ అనే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా రెండో స్థానంలో నిలిచింది. మూడో ఉత్తమ చిత్రంగా ఇరాన్ డ్రామా మూవీ ‘బల్లాడ్ ఆఫ్‌ ఏ వైట్ కౌ’ ఎంపికైంది.

- Advertisement -

‘2021 పనోరమా ఆడియన్స్ అవార్డ్ విభాగంలో కూడా మరికొన్ని చిత్రాలకు బెర్లిన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారాలను ప్రకటించారు. ‘ద లాస్ట్ ఫారెస్ట్’ తొలి ఉత్తమ చిత్రంగా, ‘మిగ్యుయెల్స్ వార్’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ‘జెండరైజేషన్’ థర్డ్ బెస్ట్ మూవీగా నిలిచాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana