టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ గురువారం తన 93వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్ మహా డైరెక్ట్ చేస్తున్న మర్మాణువు ప్రీ లుక్ విడుదల సరికొత్తగా కనిపిస్తూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ప్రవీణ్, శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది పుల్ స్పీడుమీదున్నాడు రాజశేఖర్.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తున్నాడు. గతం ఫేం కిరణ్ కొండమడుగుల డైరెక్షన్ మరో చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రాజశేఖర్. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలో యూఎస్‌లో ఈ ప్రాజెక్టు షురూ కానుందట. మొత్తానికి రాజశేఖర్ నటిస్తోన్న 3 సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తున్నాయి. రాజశేఖర్ హీరోగా నటించిన అర్జున సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..కరోనా లాక్డౌన్ తో వాయిదా పడ్డది.