సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 16:25:19

ఫోటోషూట్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌రుగులు పెట్టిన పెండ్లికూతురు!

ఫోటోషూట్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌రుగులు పెట్టిన పెండ్లికూతురు!

మంగ‌ళ‌వారం లెబ‌నీస్ రాజ‌ధాని బీరుట్లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొంత‌మంది ఇంటి ప‌నులు చేసుకుంటుంటే, మ‌రికొంత‌మంది పెళ్లి ప‌నుల్లో బిజీగా.. ఇలా ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు ఉండ‌గా పేలుడు సంభ‌వించింది. అలా ఒక వ‌ధువు తెల్ల‌ని దుస్తులు ధ‌రించి పెళ్లి ఫోటోషూట్‌లో పాల్గొన్న‌ది. దానికోసం పెద్ద మొత్తంలోనే డెక‌రేష‌న్ చేసున్నారు. ఒక్క‌సారిగా బ్లాస్ట్ జ‌ర‌గ‌డంతో ఆ పెళ్లికూతురు త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు అక్క‌డి నుంచి ప‌రుగులు తీసింది.

అప్పుడే ఫోటోషూట్ ప్రారంభించిన వ‌ధువు వీడియోలో ఈ సంఘ‌ట‌న అంతా రికార్డైంది. ఈ వీడియోలో సెట‌ప్ మొత్తం ఎలా ధ్వంసమైందో చూడొచ్చు. ఈ వీడియోను యూజ‌ర్ రాషాల్ హౌబ్ మైక్రో బ్లాగింగ్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'బీరుట్ డౌన్‌టౌన్‌లో వధువు' అనే శీర్షిక‌ను జోడించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. దీనిని ఇప్ప‌టివ‌ర‌కు 2.3 మిలియ‌న్ల మంది వీక్షించారు. 


logo