ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 12:00:41

భారీ పేలుడు మ‌ధ్య ప్ర‌శాంతంగా పియానో ప్లే చేస్తున్న బామ్మ‌!

భారీ పేలుడు మ‌ధ్య ప్ర‌శాంతంగా పియానో ప్లే చేస్తున్న బామ్మ‌!

లెబ‌నీస్ రాజ‌ధాని బీరుట్లో భారీ పేలుడు సంభ‌వించింది. దీనివ‌ల్ల వంద‌లాది మంది మ‌ర‌ణించారు. వేలాది మంది గాయ‌ప‌డ్డారు. ఒక్క‌సారిగా న‌గ‌రం మొత్తం అత‌లాకుత‌లం అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. పాత బీరుట్ నివాసి 79 ఏండ్ల బామ్మ త‌న అపార్ట్‌మెంట్‌లో ఏర్ప‌డిన పేలుడు మ‌ధ్య ప్ర‌శాంతంగా పియానో ప్లే చేస్తున్న‌ది.

ఇల్లంతా ధ్వంస‌మైపోయి ఉంది. ఎక్కడ వ‌స్తువులు అక్క‌డ కింద ప‌డిపోయి పగిలిపోయి అంతా నాశ‌నం అయిపోయింది. అయితే పేలుడు స‌మ‌యంలో ఆ బామ్మ అక్క‌డ లేదు. ఇంటికి వ‌చ్చేస‌రికి 60 ఏండ్ల నుంచి నివ‌శిస్తున్న ఇల్లు అంతా మారిపోయింది. త‌న పెళ్లి రోజున గిఫ్ట్‌గా ఇచ్చిన పియానోను ప్లే చేస్తూ ఈ ప్ర‌మాదాన్ని మ‌ర్చిపో‌వాల‌నుకున్న‌ది. ఈ వీడియోను త‌న మ‌న‌వ‌రాలు మెల్కీ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియో అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తున్న‌ది. 


logo